Dec 03,2021 19:20

చదువు కోరుకొనే వాడు
నడత నేర్చుకొనేవాడు
సలహాలు పొంది తాను
సంస్కారం నేర్చువాడు

సాధనలు చేయువాడు
జవాబులు నేర్చువాడు
శిక్షనూ పొంది తాను
శిక్షణను పొందువాడు

కలలనూ కనేవాడు
సాకారం చేయువాడు
కష్టాలను ఎదిరించీ
ఫలితమును పొందుతాడు

క్రమశిక్షణ నేర్చువాడు
వినయంతో ఉండువాడు
చదువే కర్తవ్యంగా
మునుముందుకు సాగువాడు

- రావిపల్లి వాసుదేవరావు
94417 13136