Dec 04,2021 03:13

మాట్ల్లాడుతున్న ఎమ్మెల్యే నాగిరెడ్డి

ప్రజాశక్తి-యంత్రాంగం
కలెక్టరేట్‌:విభిన్న ప్రతిభావంతులను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్బంగా విఎమ్‌ఆర్‌ డిఎ బాలల ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మనిషికి అవయువలోపం ఉన్నా ఆత్మస్థైర్యం మాత్రం ఉంటుందని, 15 మంది ఐఏఎస్‌ కు ఎంపికై రాష్ట్రంలో వివిధ ఉన్నత హౌదాల్లో పని చేస్తుండటమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి డిప్యూటి మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, జాయింట్‌ కలెక్టర్‌(ఆసరా) విశ్వేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, సహాయ సంచాలకులు శాస్త్రి పాల్గొన్నారు.
నక్కపల్లి : స్థానిక భవిత కేంద్రంలో ఐఇఆర్‌పి నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంఇఒ డివిడి.ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనకాపల్లి : స్థానిక లెప్రసీ కాలనీలో పేదలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పాత్రపల్లి వీరు యాదవ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాదముని ఫణీంద్ర, మొల్లి చంద్రశేఖర్‌, పెట్ల సన్యాసిరావు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట: బుచ్చయ్యపేటలో ప్రాథమిక పాఠశాలలో దినోత్సవంగా సందర్భంగా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఎంపీపీ దా కారపు నాగేశ్వరి దేవి, మండల పార్టీ అధ్యక్షులు కొల్లిమల్ల అచ్చం నాయుడు పాల్గొన్నారు.
కశింకోట : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) ఆధ్వర్యంలో తాళ్ళపాలెం జంక్షన్‌లో ర్యాలీ నిర్వహించారు. కశింకోట నెంబర్‌ - 2 పాఠశాల భవిత కేంద్రంలో బహుమతులు అందజేశారు. హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు శ్రీధర్‌ రెడ్డి, రామలక్ష్మి, కొర్రుపోలు వెంకటేశ్వరరావు, బివి.రమణమ్మ పాల్గొన్నారు.
గాజువాక : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) ఆధ్వర్యంలో పెదగంట్యాడ కమ్యూనిటీ వెల్ఫేర్‌ సెంటర్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడూరు అప్పలనాయుడు మాట్లాడుతూ వికలాంగుల చట్టం - 2016కు నేటి వరకూ డ్రాఫ్ట్‌ రూల్స్‌ రూపొందించి రాష్ట్రంలో అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ వికలాంగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. వేదిక నగర అధ్యక్షులు పాల వెంకయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జివిఎంసి 65వ వార్డు కార్పొరేటర్‌ బి.నరసింహపాత్రుడు (కేబుల్‌ మూర్తి), వైసిపి 64వ వార్డు అధ్యక్షులు ధర్మాల శ్రీనివాస్‌, ఉక్కు నిర్వాసిత సంఘం నాయకులు గొందేశి సత్యారావు, ఎన్‌పిఆర్‌డి స్టీల్‌ డివిజన్‌ నాయకులు నాగమణి, నూకరాజు, బి.రాజు, ఆనంద్‌, మాధవ్‌, గోవింద్‌, సత్తిబాబు, కన్నారావు, ఈశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
కె.కోటపాడు:ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు విభిన్న ప్రతిభా వంతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాయని కె.కోటపాడు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ రెడ్డి అరుణ అన్నారు. స్థానిక భవిత కేంద్రంలో ఆమె మాట్లాడారు. సహిత విద్య ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, కన్నమ్మ పాల్గొన్నారు.
దేవరాపల్లి: దేవరాపల్లి భవిత సెంటర్‌లో ఐఈఆర్‌టి టీచర్‌ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో మండల విద్యాశాఖ అధికారి సిహెచ్‌ రవీంద్ర బాబు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌, దేవరాపల్లి మెయిన్‌ స్కూల్‌ హెచ్‌ఎం కృష్ణ స్వామి నాయుడు, సీఆర్పీలు పాల్గొన్నారు.
మాకవరపాలెం:విభిన్న ప్రతిభా వంతులకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని, వాటిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని ఎంఈవో సాయి శైలజ కోరారు. మాకవరపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో భవిత కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎం అచ్చుతరాం, ఉషారాణి పాల్గొన్నారు.
నర్సీపట్నం రూరల్‌:ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శ్రీ రామాంజనేయ టెక్స్‌ టైల్స్‌ అధినేత కాశరపు రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం సుమారు వందమందికి పైగా మహిళలకు, వద్ధులకు, పిల్లలకు నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ గొలుసు నరసింహ మూర్తి పంపిణీ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా నియోజకవర్గ పరిసర ప్రాంతంలో సేవా దక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కౌన్సిలర్‌ దాడి బుజ్జి, కో ఆప్షన్‌ సభ్యులు లగుడు స్వామి, గుర్రందొర పాలెం సర్పంచ్‌ సేనాపతి వెంకటరత్నం
కోటవురట్ల: విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా కోటవురట్ల భవిత కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహ కాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌ కుమార్‌, సుబ్బారావు, పాల్గొన్నారు.
అనకాపల్లి : వికలాంగుల పట్ల ప్రభుత్వాల చిన్నచూపు తగదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి బి.నూక అప్పారావు అన్నారు. స్థానిక దొడ్డి రామునాయుడు కార్మిక, కర్షక నిలయంలో శుక్రవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాపేటి భాస్కరరావు, బుద్ధ ధనలక్ష్మి, ఆడారి అన్నపూర్ణ, కృష్ణవేణి, రామ రత్నం, మంగ తదితరులు పాల్గొన్నారు.