Nov 28,2020 01:09

ములగాడ : పార్టీలో విభేదాలు లేకుండా రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి, వైసిసి జెండాను ఎగురవేసి తీరుతామని ఆ పార్టీ పారిశ్రామిక ప్రాంత నాయకులు అన్నారు. నగర మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ, 60వ వార్డు వైసిపి అభ్యర్థి పివి.సురేష్‌ మధ్య కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో వైసిపి పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్‌ ఆదేశాల మేరకు శుక్రవారం పారిశ్రామిక ప్రాంత ఏడు వార్డుల ముఖ్య నాయకులు పిలకవానిపాలెం వైష్ణవి ఫంక్షన్‌ హాల్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఇరువురి మధ్య జరిగిన వివాదం సర్దుమణిగినట్లు తెలిపారు. ఏడు వార్డుల్లో విజయమే లక్ష్యంగా తామంతా కలిసికట్టుగా పని చేస్తామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో వైసిపి నాయకులు కలిదిండి బద్రీనాథ్‌, పిల్లా కన్నబాబు, దాడి సత్యనారాయణ (డిపో) గల్లా శ్రీను, పిలక రామ్మోహన్‌రెడ్డి, గుండప్ప నాగేశ్వరరావు, పుర్రె సురేష్‌ యాదవ్‌, బల్ల లక్ష్మణరావు, గుల్లివెందుల కృష్ణ, జివిఎస్‌ఎన్‌.రాజు పాల్గొన్నారు.