Jan 15,2022 15:29

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇద్దరు చిన్నారులు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కి తగ్గట్టుగా డ్యాన్స్‌ చేసిన వీడియో ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించి రికార్డును సృష్టించింది. కేవలం చిన్నారుల వీడియోకే ఇన్ని కోట్ల వ్యూస్‌నా అని ఆశ్చర్యపోకండి. ఇప్పుడు ఈ వీడియో అందరికీ తెలిసిన వీడియోనే. అదేనండీ 'పింక్‌ ఫాంగ్‌' యూట్యూబ్‌ ఛానెల్‌ పోస్ట్‌ చేసిన 'బేబీ షార్క్‌ డూ.. డూ..డూ' డ్యాన్స్‌ వీడియో. బేబీ షార్క్‌ పాటను 2015లో కొరియన్‌ - అమెరికన్‌ సింగర్‌ హోప్‌ సెగోయిన్‌ పాడగా... ఈ వీడియోను 2016 జూన్‌లో అప్‌లోడ్‌ చేశారు. 2016 నుంచి 2020 నవంబర్‌ నాటికి ఈ వీడియో 700 కోట్ల వ్యూస్‌ని సాధించింది. తాజాగా ఈ వీడియో వెయ్యికోట్లకు పైగా వ్యూస్‌ సాధించడంపై పింక్‌ఫాంగ్‌ సీఈవో మిన్‌ సియోక్‌ కిమ్‌ మాట్లాడుతూ.. 'మా బేబీ షార్క్‌ వీడియో మరో మైలురాయిని అందుకోవడం సంతోషంగా ఉందని' ఆయన హర్షం వ్యక్తం చేశారు. బేబీ షార్క్‌ ఆధారంగా ఒక ఫీచర్‌ ఫిల్మ్‌ కూడా రూపొందుతుండటం విశేషం.

వీడియో : https://youtu.be/XqZsoesa55w