Mar 02,2021 21:53

యశశ్రీనిని అభినందిస్తున్న హెచ్‌ఎం, ఉపాధ్యాయులు

నెల్లిమర్ల: స్థానిక ఆదిత్య విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న అల్లం యశశ్రీ రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా కరస్పాండెంట్‌ వి.సూరిబాబు మంగళవారం యశశ్రీని అభినందించారు. గత నెల 29న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో యశశ్రీ 59 కిలోల సీనియర్‌ విభాగంలో రజత పతకం సాధించింది. ఆమెకు కొండవెలగాడకు చెందిన చల్లా రాము శిక్షణ ఇచ్చారు. పతకం సాధించిన విద్యార్థిని హెచ్‌ఎం వి. అమత, ఉపాధ్యాయులు అభినందించి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాక్షించారు.