
అనంతపురం (తాడిమర్రి) : తాడిమర్రి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన కురుబ ఆదినారాయణ కుమారుడు కురుబ మనోజ్ కుమార్ (23) అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈరోజు ఉదయము గొర్రె పిల్లలకు వేపాకు కోసం ఊరి పక్కనే ఉన్న వేప చెట్టు ఎక్కి ఆకు కోస్తున్న సమయంలో చెట్టుపైన ఉన్న విద్యుత్ మెయిన్ తీగలు తగిలి షాక్కు గురయ్యాడు. స్థానికులు వెంటనే చికిత్స కోసం బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.