Nov 26,2020 20:45

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జిడిపి భారీగా పతనం కాగా.. అనంతరం తాము భావించినదాని కంటే జిడిపి వృద్థి మెరుగ్గా ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ అన్నారు. ఫారిన్‌ ఎక్స్‌చేంజ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఇడిఎఐ) వార్షిక దినోత్సవం సందర్భంగా దాస్‌ మాట్లాడుతూ రికవరీ మెరుగ్గానే ఉన్నప్పటికీ ఆర్థిక వఅద్ధిపై మాత్రం ఇంకా జాగ్రత్తగా వేచి చూడాల్సి ఉందన్నారు. ఆర్థిక వఅద్ధిపై ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉందని, ఆ ప్రభావం భారత్‌పై కూడా ఉందన్నారు. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ జిడిపి ఏకంగా మైనస్‌ 23.9 శాతం పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం పడిపోవచ్చని ఆర్‌బిఐ అంచనా వేసింది. కాగా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన తర్వాత ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయన్నారు.