
వ్యాధులతో పోరాడేందుకు మన శరీరానికి వేడి అవసరం. అయితే ఇది ఎక్కువైతే ప్రమాదమే. అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, నీటిలో కరిగిపోయే కొవ్వు వంటివి శరీరంలో వేడి, మంటను పెంచుతాయి. ఈ కారణంగానే ఇన్ఫ్లమేటరీ సమస్యలు ఉన్నవారు లో-షుగర్ డైట్‌ను వాడుతుంటారు. ఐతే కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరంలో వేడి, మంట, వాపులు, నొప్పులను సహజసిద్ధంగా తగ్గిస్తాయి.
పాలకూర : ఇందులో విటమిన్-ఇ మన శరీరంలో వేడి, నొప్పులు, మంటల బాధను తరిమికొడుతుంది. పాలకూర ఎంత ఎక్కువ ఆకుపచ్చ రంగులో ఉంటే, అంత ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది.
దానిమ్మ గింజలు : దానిమ్మ గింజల్లో మన శరీరంలోని విష పదార్థాలతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, బిపిని తగ్గిస్తాయి. వీటిలోని ప్యూనికాలాజిన్ అనే పదార్థం మన మెదడులోని వేడి, నొప్పులను తరిమికొడుతుంది. మతిమరపు లాంటి సమస్యలు రాకుండా దానిమ్మ గింజలు చక్కగా పనిచేస్తాయి.
బ్లాక్ టీ : బ్లాక్ టీ తాగడం వల్ల మన బాడీలో ధమనులు తెరచుకుంటాయి. బ్లాక్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర కణాలు పాడవకుండా కాపాడతాయి. ఇది ఒవారియన్ కేన్సర్‌ను కూడా అడ్డుకుంటుందని ఓ అధ్యయనంలో తేలింది.
పియర్స్ : కీళ్ల నొప్పులు, డయాబెటిస్ ఉన్నవారు, శరీరంలో మంటలతో బాధపడేవారు పియర్స్ పండును తింటే సరి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా వేడిని తగ్గిస్తుంది. ఇందులోని మైక్రోబయోమ్ అనే పదార్థం వేడితోపాటూ, బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది.
బెల్ పెప్పర్స్ : ముఖ్యంగా ఎరుపు రంగు బెల్పెప్పర్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థం తక్కువగా ఉంటుంది. స్పైసీ పెప్పర్స్ లాగానే ఇవి కూడా కాప్సారుసిన్ అనే రసాయనం కలిగివుంటాయి. ఇది శరీరంలో మంట, నొప్పులను మటుమాయం చేస్తుంది.