Jan 28,2021 11:13

చిత్తూరు (వెదురుకుప్పం) : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగరా మోగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోని వెదురుకుప్పం మండలంలో పంచాయతీల రిజర్వేషన్‌ను అధికారులు విడుదల చేశారు. మండలంలో 25 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 14 పంచాయతీలు మహిళలకు రిజర్వేషన్‌ ఖరారు అయ్యింది. వార్డు సభ్యుల పదవులకు నామినేషన్ల దాఖలుకు ఆశావాహులు సిద్ధమవుతున్నారు. అగ్గిచేనుపల్లి (ఓసీ), ఆళ్ళమడుగు (ఓసీ-మహిళ), యనమలమంద (ఓసీ), దిగువ పల్లాలు (ఓసీ-మహిళ), బొమ్మయ్యపల్లె (ఎస్సీ), బ్రాహ్మణపల్లె (బిసీ), నల్ల వేంగనపల్లె (ఎస్సీ-మహిళ), తిరుమలయ్యపల్లె (ఎస్సీ-మహిళ), దేవరగుడిపల్లె (ఎస్సీ), గొడుగుచింత (బిసీ), ఇనాం కొత్తూరు (ఓసీ), ఘంటావారిపల్లె (ఓసీ), జక్కదొన (ఎస్టీ-మహిళ), కొమరగుంట (బీసీ-మహిళ), కురివికుప్పం (ఓసీ), మాంబేడు (ఎస్సీ), మారేపల్లె (ఓసీ), మొండి వెంగనపల్లె (ఓసీ-మహిళ), పచ్చికాపల్లం (ఎస్సీ-మహిళ), పాతగుంట (ఓసీ-మహిళ), పెరుమాళ్ళపల్లె (ఓసీ-మహిళ), తిప్పినాయుడుపల్లె (ఓసీ), టికేయం పురం (ఓసీ-మహిళ), సంతబైలు (ఓసి-మహిళ), వెదురుకుప్పం (ఎస్సీ-మహిళ) రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహులు నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్ను, ఓటర్‌ ఐడి చెక్‌ చేసుకోవడం ఇలాంటి పనులలో బిజీగా ఉన్నారు. వెదురుకుప్పం మండలం పంచాయతీలలో ఎక్కువ రిజర్వేషన్లు మహిళలకే దక్కాయి.