Nov 29,2020 23:45

మాట్లాడుతున్న ఎమ్మెల్యే, ప్రభుత విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

ఎమ్మెల్యే, ప్రభుత విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ప్రజాశక్తి - మాచర్ల : వడ్డెర్ల రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదలకు కృషి చేస్తానని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామక్రిష్టారెడ్డి హమీ ఇచ్చారు. స్థానిక సీతారామస్వామి దేవస్థానంలో ఆయన్ను వడ్డెర్లు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్డెర్లకు మాచర్లలో 30 సెంట్ల స్థలం కేటాయించి రూ.50 లక్షల నిధులు ఇచ్చి కల్యాణ మండపం ఏర్పాటుకు సాయం చేస్తానని తెలిపారు. ఈ దేవస్థానంలో కల్యాణ మండపంకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని, దుర్గి ఎంపిపి పదవిని కొంత కాలం కేటాయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాచర్ల మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు, వేముల నాగయ్య, తురకా కిషోర్‌ బండారు శ్రీనివాసరావు, బండారు పరమేశ్వరరావు పాల్గొన్నారు.