Nov 24,2020 21:28

నాగార్జున 'వైల్డ్‌ డాగ్‌' సినిమా దాదాపుగా పూర్తయింది. మరోవైపు ప్రవీణ్‌ సత్తారుతో నాగార్జున సినిమా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమాను కూడా నాగ్‌ చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమా వచ్చే నెలలో పట్టాలెక్కే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో.. అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత నాగార్జున హిందీలో నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' మూవీ కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.