Jan 13,2021 23:44

షాదీఖానాలో సమావేశమైన వైసిపి మైనార్టీ నాయకులు

ప్రజాశక్తి-శింగరాయకొండ: శింగరాయకొండ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో నాయకుల మధ్య పోరు రోజురోజుకు పెరుగుతుంది. ముస్లిం మైనారిటీ నాయకుల్లో పార్టీలో ప్రాధాన్యత లేదని ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డిని అమరావతిలో కలిసి తమ బాధను చెప్పుకున్నారు. ఆయన వెంటనే కొండపి ఇన్‌చార్జి డాక్టర్‌ మాదాసి వెంకయ్యతో మాట్లాడుకోవాలని సూచించారు. మంత్రి నేరుగా మాదాసితో మాట్లాడారు. మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఇటీవల జరిగిన ఇళ్ల పట్టాల వద్ద నుంచి ఈ పోరు మొదలైంది. తాజాగా పార్టీ కార్యక్రమాలన్నీ కన్వీనర్‌ తాండ్ర రామమూర్తికి అప్పగించారు. అయితే బుధవారం రాత్రి శింగరాయకొండ షాదీఖానాలో ముస్లిం మైనారిటీలు భారీగా సమావేశమయ్యారు. వైసిపిలో జరుగుతున్నా అన్యాయాల గురించి, పదవుల్లో ముస్లిములకు తలెత్తుతున్న ఇబ్బందుల గురించి చర్చించుకున్నారు. గతంలో పట్టణ అధ్యక్షులుగా ముస్లిములకు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.