Jan 17,2021 00:49

ఇరు పార్టీల వారిని అదుపుచేస్తున్న పోలీసులు

సబ్బవరం : మండలంలోని పెదగొల్లలపాలెం గ్రామంలో సీతారాముల తీర్థం సందర్భంగా స్టేజ్‌ విషయంపై టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య శనివారం ఘర్షణ చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భారీగా బందోబస్తు నిర్వహించారు. సీతారాముల తీర్థం సందర్భంగా ప్రతి ఏటా టిడిపి శ్రేణులు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది వీరి స్టేజ్‌ పక్కనే వైసిపికి చెందిన కొంతమంది స్టేజ్‌ వేయడంతో వీరి మధ్య వివాదం నెలకొంది. మాటా మాటా పెరగడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సిఐ చంద్రశేఖర్రావు నేతృత్వంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్న ఇరు పార్టీల వారు వేసిన స్టేజ్‌లను తొలగించారు. దీంతో వివాదం కొంతమేరకు సద్దుమణిగింది.