Feb 04,2021 13:15

విశాఖపట్నం(విశాఖ): వైజాగ్‌స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఎం నగర నాయకుడు గంగారావు, ఆర్‌కెఎస్‌ కుమార్‌, సుబ్బారావు, ప్రియాంక, తదితరులు పాల్గన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన రంగాలను ప్రయివేటీకరిస్తోందని మండిపడ్డారు. దీనిని అందరూ వ్యతిరేకించాలన్నారు. ప్రయివేటీకరణతో రానున్న రోజుల్లో అనేక ఇబ్బందులు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

vizag