
నిబంధనలు అతిక్రమిస్తే కేసు నమోదు -జిల్లా వైద్యాధికారి పెంచలయ్య
ప్రజాశక్తి - కార్వేటినగరం: ఆర్ఎంపిలు, పిఎంపిలు నిబంధనలను అతిక్రమించి ఇంజక్షన్లు, సలైన్ బాటిల్లు పెడుతుండటంపై జిల్లా వైద్య అధికారులు సోమవారం మెరుపు దాడులు చేయడంతో పరారయ్యారు. పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న ఆర్ఎంపీలు అనే శీర్షిక పై స్పందించిన జిల్లా అధికారులు. మండల పరిధిలోని కొల్లగుంట చెక్పోస్ట్ సమీపంలో తమిళనాడుకు సరిహద్దు కూతవేటు దూరంలో ఆర్ఎపిలు నిర్వహిస్తున్న క్లినిక్ లపై దాడులు నిర్వహించారు. దీంతో సమాచారం అందుకున్న ఆర్ఎంపిలు పరారీ అయ్యారు. దీంతో జిల్లా వైద్య అధికారులు వారు రోగులకు వాడుతున్న మందులు, ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లను గుర్తించారు. జిల్లా వైద్యాధికారి పెంచలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో దొరకని మందులు కూడా ఆర్ఎంపి వైద్యశాలల అందుబాటులో ఉండటం చూసి ఉలిక్కి పడ్డానన్నారు. ఆర్ఎంపిలు టి-ఎంపిలు ప్రథమ చికిత్సకు మాత్రమే పరిమితమని, ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లను, అబాషిన్లు,కాన్పులు వంటి చేపడితే జైలుకు పంపుతామని హెచ్చరించారు.