Oct 27,2021 22:07

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. మాచర్ల సుహాసిని
మచిలీపట్నం :
వైద్య సేవల్లో అలసత్వాన్ని వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. మాచర్ల సుహాసిని హెచ్చరించారు. బుధవారం మచిలీపట్నం మండలంలోని గుండి పాలెం, చిన్నాపురం లను సందర్శించి ఏఎన్‌ఎం విధులను, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నాపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి స్టోర్‌ నిర్వాహణపై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం కోడూరు ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించి ఏరియాలో పర్యటించి వైద్య ఆరోగ్యశాఖ నుండి అందుతున్న సేవలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.క ోడూరులోని కోట రాఘవయ్య డిగ్రీ కళాశాలలో వాక్సిన్లపై, 'పారిశుద్ధ్యం-ఆరోగ్యం పై నేటి విద్యార్థుల పాత్ర' అనే అంశంపై విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు. రెండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అర్హుల జాబితా ప్రకారం కరోనా వాక్సిన్‌ వేసుకోవాటానికి తిరస్కరించిన వారిని కలసి వ్యాక్సిన్‌ గూర్చి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె తో పాటు చిన్నాపురం, కోడూరు వైద్యాధికారులు డా. నడకుదిటి నాగ నిఖిల, డా. వి మంజుల, చిన్నాపురం విస్తరణాధికారి పి.వి.పరమేశ్వరరావు, కోడూరు విస్తరణాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌
కోడూరు :
కోడూరులోని శ్రీ కోట రాఘవయ్య డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను జిల్లా వైద్యాధికారి యం.సుహాసిని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాక్సినేషన్‌పై అవగాహా కల్పించారు. అనంతరం విద్యార్థులకు దగ్గర ఉండి వ్యాక్సిన్‌ వేయించారు. ఈ కార్యక్రమంలో ఈకార్యక్రమంలో కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు సోమరాజు మంజుల, సిబ్బంది పాల్గొన్నారు.