May 18,2021 22:16

మాట్లాడుతున్న అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంగల్‌ రెడ్డి, జవహకర్‌లాల్‌

ఏపి ఎన్‌జిఒ సంఘం నేతలు
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్‌: 
విద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ ఆ శాఖ ఉద్యోగుల పట్ల వ్యవహరించిన తీరు సరైంది కాదని ఏపి ఎన్‌జిఒ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌ వెంగల్‌ రెడ్డి, వి.జవహర్‌ లాల్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి రెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఏపిఎన్‌జిఒ హోంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కోవిడ్‌ సమయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎనలేని సేవలు చేస్తున్నారని, వారిని గుర్తించాల్సింది పోయి ఆ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ తీవ్ర పదజాలంతో దూషణలు చేయడం సరైంది కాదన్నారు. యాప్‌ల పేరుతో ఉద్యోగుల పట్ల తీవ్ర వేధింపులకు గురి చేయడం తగదన్నారు. వెంటనే ఆ శాఖ కమిషనర్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నాయకులు పాండురంగారెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, సాంబశివారెడ్డిలు పాల్గొన్నారు.