Oct 27,2021 22:45

విగ్రహ ప్రతిష్టాపన మహో త్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల

ప్రజాశక్తి-చాగలమర్రి : చాగలమర్రిలోని చిన్నమకానం వీధిలో వెలసిన శ్రీ రామలింగేశ్వర ఆలయంలో గణపతి, నాగ దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ దుర్గం రామసుబ్బారెడ్డి, ఎంపిపి వీరభద్రుడు, వైసిపి రాష్ట్ర మైనారిటీ సెల్‌ కార్యదర్శి బాబులాల్‌, మండల కన్వీనర్‌ కుమార్‌రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి గణేష్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, హిందు సంఘ పెద్దలు పాల్గొన్నారు.