Oct 27,2021 19:49

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీ పరిధిలో ఖాళీగా ఉన్న వాలంటీర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి నియామక పత్రాలు అందజేశారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ జి. శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన వాలంటీర్లకు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్‌ పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు సకాలంలో అందించడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.