Apr 15,2021 01:06

నివాళ్ల‌ర్పిస్తున్న క‌లెక్ట‌ర్ విన‌య్ చంద్

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ జయంతిని జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంబేద్కర్‌ దేశానికి చేసిన కృషిని వక్తలు కొనియాడారు.
పరవాడ : స్థానిక బాలికల వసతి గృహంలో జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, ఐద్వా మండల కార్యదర్శి పి.మాణిక్యం పాల్గొన్నారు. ఎన్‌టిపిసిలో జరిగిన కార్యక్రమంలో సంస్థ గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ దివాకర్‌ కౌశిక్‌, ఎకె.శ్రీవాస్తవ, జిసి.చౌక్సీ, పాల్గొన్నారు. ఫార్మా సిటీ కాలనీలో టిడిపి జెడ్‌పిటిసి అభ్యర్థి ఎఎస్‌.అప్పారావు, లంకెలపాలెం ఎస్‌సి కాలనీలో కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. చింతపల్లి : ఎంపిడిఒ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోనంగి చిన్నయ్య పడాల్‌, మండల కార్యదర్శి సాగిన చిరంజీవి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జీవన్‌ పాల్గొన్నారు. వేరొక కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్‌ కార్యాలయం నుంచి పాత బస్టాండ్‌, హనుమాన్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్‌ దురియా పుష్పలత, వైసిపి నాయకులు మోరి రవి పాల్గొన్నారు. జి.మాడుగుల : నుర్మతి బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్‌ తల్లే సూరిబాబు, ఎంపిటిసి అభ్యర్థి పేతురు బాబు పాల్గొన్నారు. మండల కేంద్రంలో టిడిపి నాయకులు ఎం.వరహాలరాజు, ఎస్‌.నాగబ్బాయి పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పాంగి రాంబాబు పాల్గొన్నారు. సబ్బవరం : స్థానిక దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయంలో అంబేద్కర్‌ ఆలోచనా విధానంపై వెబినార్‌ నిర్వహించారు. ఫ్రీ లాన్స్‌ జర్నలిస్ట్‌, ఎకనమిస్ట్‌ డాక్టర్‌ డి.పాపారావు, వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.మధుసూదనరావు వీసీ ఎస్‌.సూర్యప్రకాష్‌రావు మాట్లాడారు. కొయ్యూరు :మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు సూరిబాబు. వైసిపి నాయకులు రమేష్‌ పాల్గొన్నారు. డుంబ్రిగుడ : గిరిజన సంఘం, యుటిఎఫ్‌, సిపిఎం, టిడిపి, వైసిపి ఆధ్వర్యాన వేడుకలు జరిగాయి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.సురేంద్ర అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు ఎస్‌బి.పోతురాజు, టి.సూర్యనారాయణ, ఎస్‌.బాలకృష్ణ, ఎం.చంద్రరావు పాల్గొన్నారు. పాడేరు: ఐటిడిఎ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పిఒ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ సలిజామల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక పిఎంఆర్‌సి సమావేశ మందిరంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం -సామాజిక న్యాయం అంశంపై సదస్సు నిర్వహించారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడారు. అంబేద్కర్‌ స్ఫూర్తితో మతోన్మాదుల నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల, జిఒ - 3 సాధన కమిటీ నాయకులు కె.కాంతారావు, ఆర్‌ జగన్‌ మోహన్‌రావు, కెవి.రమణ, పి.ప్రసాద్‌, కె.కోటిజయప్రసాద్‌, వి.కొండబాబు, నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు ఆర్‌.శంకరరావు, మహిళా సంఘాల నాయకులు వి.పద్మలక్ష్మి, మంజుల, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజశేఖర్‌, ప్రవీణ్‌, పాపారావు పాల్గొన్నారు. అనకాపల్లి : గవరపాలెం అంబేద్కర్‌ నగర్‌లో ప్రముఖ న్యాయవాది నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ప్రారంభించారు. రింగ్‌రోడ్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ డాక్టర్‌ సత్యవతి, వైసిపి నాయకులు దాడి రత్నాకర్‌, డాక్టర్‌ విష్ణు మూర్తి, దంతులూరి దిలీప్‌ కుమార్‌, మందపాటి జానకి రామ రాజు, జాజుల రమేష్‌ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో భీముని గుమ్మం అంబేద్కర్‌ విగ్రహం వద్ద వేడుకలు జరిగాయి. సబ్బవరం : మండల కేంద్రంలోని సాయినగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌ రాజ్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ రమేష్‌ నాయుడు, శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి పివి.రమణ, మదర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో ట్రస్ట్‌ చైర్మన్‌ సత్య గంగ రాజు, బంగారమ్మ పాలెంలో వైసిపి నాయకులు కోటాన రాము, మల్లునాయుడు పాలెంలో సర్పంచ్‌ బోని దేముడమ్మ నాయుడు, మాజీ ఎంపిపి గండి దేముడు, మొగలిపురంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పెదబయలు : అభ్యుదయసేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచి మాధవరావు, సిపిఎం మండల కార్యదర్శి బి.సన్నిబాబు, ఉప సర్పంచి బి.గంగాధరం పాల్గొన్నారు. అనంతగిరి : కాశీపట్నం, శివలింగపురం ప్రాంతాల్లో చేపట్టాటిన కార్యక్రమాల్లో సిపిఎం నాయకులు దీసరి గంగరాజు, జె.రాజకుమారి, జె.సుబ్బారావు పాల్గొన్నారు. భీమునిపట్నం : నగరపాలెం పంచాయతీ పరిధిలోగల అంబేద్కర్‌ విగ్రహానికి సర్పంచ్‌ పొట్నూరు ఛాయాగౌతమి పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో వైసిపి మండల ప్రధాన కార్యదర్శి పొట్నూరు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. అన్నవరం ఎస్సీ కాలనీలోనూ, బార్‌ అసోసియేషన్‌ ఛాంబర్‌లోనూ, వైసిపి కార్యాలయంలోనూ కార్యక్రమాలు జరిగాయి. డైట్‌ జంక్షన్‌లో జరిగిన కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం లక్ష్మి, అంబేద్కర్‌ కాలనీలో దళిత సంఘం నాయకులు భాగం గోపాలరావు పాల్గొన్నారు. పిఎం.పాలెం : స్థానిక స్టేట్‌ బ్యాంకు శాఖ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.అప్పలరాజు, కెవిపిఎస్‌ నాయకులు కె.నాగరాజు పాల్గొన్నారు. మధురవాడ జోనల్‌ కార్యాలయం వద్ద, కొమ్మాది విలేజ్‌, భగవాన్‌ దాస్‌ కాలనీ, బేతని చర్చి ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో కార్పొరేటర్‌ డాక్టర్‌ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక, శ్రావణ్‌, ముత్తంశెట్టి మహేష్‌ పాల్గొన్నారు. ఆనందపురం : పెద్దిపాలెంలో ఉప్పాడ అప్పారావు ఆధ్వర్యంలోనూ, అనందపురం పంచాయతీలో సర్పంచ్‌ చందక లక్ష్మి ఆధ్వర్యంలోనూ కార్యక్రమాలు జరిగాయి. వెల్లంకిలో జరిగిన కార్యక్రమంలో వైసిపి నాయకులు కాకర రమణ, కంచరాపు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. నక్కపల్లి : నక్కపల్లిలో ఎస్సీ కాలనీ, మండల పరిషత్‌ కార్యాలయం, ఉద్దండపురం, చినదొడ్డిగల్లు, డొంకాడ తదితర గ్రామాల్లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.కశింకోట : మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వైసిపి జిల్లా అధికారి ప్రతినిధి మళ్ళ బుల్లిబాబు, సర్పంచ్‌ జయ రజనీ పాల్గొన్నారు. అరకు రూరల్‌ : మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గసభ్యులు వి.ఉమామహేశ్వరరావు, మండల కార్యదర్శి కె.రామారావు, సిఐటియు మండల కార్యదర్శి పి.బాలదేవ్‌, మగ్గన్న, రామన్న, జగన్నాధం, దాసు పాల్గొన్నారు. హుకుంపేట : మండల కేంద్రంలో మానవ హక్కుల విద్యా బోధన కమిటీ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో కృష్ణారావు పాల్గొన్నారు. పద్మనాభం : పద్మనాభం జంక్షన్‌, రెడ్డిపల్లి, పొట్నూరు, పాండ్రంగి, గంధవరం, బాందేవుపురం గ్రామాల్లో కార్యక్రమాలు జరిగాయి. ఎంవిపి.కాలనీ : డిసిఐలో నిర్వహించిన సభలో ఎపి ఎస్‌టి కమిషన్‌ ఛైర్మన్‌ కుంబా రవి బాబు, డిసిఐఎల్‌ ఎమ్‌డి జివైవి.విక్టర్‌ పాల్గొన్నారు. 54వ వార్డు ఓల్డ్‌ ఐటిఐ జంక్షన్‌, గజపతి నగర్‌ ఏరియాలో జరిగిన కార్యక్రమంలో టిడిపి వార్డు అధ్యక్షులు కుట్టా కార్తీక్‌ పాల్గొన్నారు. కంచరపాలెం : బిర్లా జంక్షన్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం మాజీ కార్పొరేటర్‌ బొట్టా ఈశ్వరమ్మ, సిఐటియు జోన్‌ నాయకులు రామ్‌ గోపాల్‌, సత్యనారాయణ, ఒ.అప్పారావు, ఎన్‌.సింహాచలం, ఎం.ఈశ్వరరావు, ఎం.నాగేశ్వరరావు, వెంకటరావు, శ్రావణ్‌, శారద, కళ్యాణి, బొట్టా ప్రసాద్‌, సులోచన పాల్గొన్నారు. దళిత సేన కార్యాలయంలోనూ వేడుకలు జరిగాయి. రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లమాల అప్పారావు ఆధ్వర్యాన వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. హార్బర్‌ అండ్‌ పోర్ట్‌ పెన్షనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 50వ వార్డు కార్పొరేటర్‌ వావిలపల్లి ప్రసాద్‌, ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ నిర్మల దంపతులను కళింగ నగర్‌లోగల అసోసియేషన్‌ కార్యాలయంలో సన్మానించారు. బుచ్చయ్యపేట : మండలంలోని అన్ని గ్రామాల్లోనూ వేడుకలు జరిగాయి. కె.కోటపాడు : కింతాడ గ్రామంలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, సర్పంచి బండారు ఈశ్వరమ్మ పాల్గొన్నారు. తొలుత ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైసిపి నాయకులు రెడ్డి మోహన్‌, కెవిపిఎస్‌ మండల నాయకులు గాడి ప్రసాద్‌ పాల్గొన్నారు. ఎ.కోడూరు, సింగన్న దొరపాలెం గ్రామాలలో జరిగిన కార్యక్రమాల్లో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గండి నాయనబాబు. ప్రజా సంఘాల జిల్లా కన్వీనర్‌ ఎర్ర దేవుడు పాల్గొన్నారు. కోటపాడులో ఎస్‌ఐ కె.అప్పలనాయుడు పాల్గొన్నారు. అయ్యన్న విద్యాసంస్థల్లో కరస్పాండెంట్‌ డాక్టర్‌ ఎస్‌కె.కాశిం పాల్గొన్నారు. చీడికాడ : చీడికాడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వైసిపి నాయకులు గొల్లవెళ్లి రాజబాబు పాల్గొన్నారు. టిడిపి సర్పంచి గాలి సామలమ్మ ఆధ్వర్యంలోనూ వేడుకలు జరిగాయి. నర్సీపట్నం టౌన్‌ : అబీద్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ మాట్లాడారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ గొలుసు నరసింహమూర్తి పాల్గొన్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్‌ చింతకాయల పద్మావతి, 25వ వార్డు కౌన్సిలర్‌ చింతకాయల రాజేష్‌ పాల్గొన్నారు. సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అబీద్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా ఉపాద్యక్షులు డి.సత్తిబాబు, అడిగర్ల రాజు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సాపిరెడ్డి నారాయణముర్తి, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ నాయకులు జి.గీతాకృష్ణ పాల్గొన్నారు. నర్సీపట్నం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బలిఘట్టంలో వేడుకలు జరిగాయి. రోలుగుంట : జె.నాయుడుపాలెం గ్రామంలో జరిగిన వేడుకల్లో ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు సినీ దర్శకులు బి.గోపాల్‌, గ్రామ సర్పంచ్‌ వెంకటరమణ పాల్గొన్నారు. మాడుగుల : బస్‌ స్టాండ్‌ వద్ద సర్పంచ్‌ కళావతి, వైస్‌ సర్పంచ్‌ శ్రీనివాసరావు, సుందరరాజు, అంబేద్కర్‌ కాలనీ వద్ద మారువాడ ఈశ్వరరావు, ఎం.కోడూరులో సర్పంచ్‌ సంజీవరావు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కరాస: ఎన్‌ఎస్‌టిఎల్‌లోని మానసి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో అవుట్‌ స్టాండింగ్‌ సైంటిస్ట్‌, ఎన్‌ఎస్‌టిఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఒఆర్‌ నందగోపన్‌ పాల్గొన్నారు. గాజువాక : జివిఎంసి జోనల్‌ కార్యాలయం దగ్గర జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జి.సుబ్బారావు, అప్పారావు పాల్గొన్నారు. అప్పన్న కాలనీలో జరిగిన కార్యక్రమంలో సిఐటియు నాయకులు కిరీటం, సంతోషం పాల్గొన్నారు. 68వ వార్డులోని అక్కిరెడ్డిపాలెంలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాంబాబు, లోకేష్‌, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. విశాఖపట్నం : సిధ్ధార్థ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి డాక్టర్‌ జి.ప్రియాంక, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి యుఎస్‌ఎన్‌.రాజు, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ సంఘం నాయకులు సంతోష్‌, ఐద్వా మద్దిలపాలెం జోన్‌ కన్వీనర్‌ కె.కుమారి, నాయకులు విజయ, లలిత పాల్గొన్నారు. మహరాణిపేట : జెడ్‌పి కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జెడ్‌పి సిఇఒ నాగార్జున సాగర్‌, జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌పి బి.కృష్ణారావు, ఎయులో జరిగిన కార్యక్రమంలో వీసీ ఆచార్య పివిజిడి.ప్రసాద రెడ్డి, రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ పాల్గొన్నారు. ములగాడ : పారిశ్రామిక ప్రాంత గ్రామాలలో జై భీమ్‌ యూత్‌ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఇంద్రాకాలనీలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో 63వ వార్డు కాకరలోవలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. జోన్‌ అధ్యక్షులు కె.పెంటారావు, నాయకులు ఆర్‌.లక్ష్మణమూర్తి మాట్లాడారు. ఇదే వార్డులో జరిగిన వేరొక కార్యక్రమంలో కార్పొరేటర్లు బల్ల లక్ష్మణ్‌, గుండపు నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మళ్ల విజయ ప్రసాద్‌ పాల్గొన్నారు. సీతమ్మధార: ఎంఎంటిసిలోని అంబేద్కర్‌ విగ్రహానికి సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు వామనమూర్తి పూలమాల వేశారు. వైసిపి విశాఖ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు, కటుమూరి సతీష్‌, బాణాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. సిపిఎం అక్కయ్యపాలెం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో నాయకులు ఆర్‌పి.రాజు మాట్లాడారు. కలెక్టరేట్‌ : ఎల్‌ఐసి దరి అంబేద్కర్‌ విగ్రహం వేదికగా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యాన వేడుకలు జరిగాయి. వైసిపి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి, జివిఎంసి మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి పాల్గొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్‌, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ వి.వినరు చంద్‌ పాల్గొని అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కెజిహెచ్‌లో జరిగిన కార్యక్రమంలో కెజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలి, ఎపిఇపిడిసిఎల్‌లో జరిగిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు కె.రాజ బాపయ్య, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో జరిగిన కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.రాజేశ్వర రావు, నగర కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి వజ్జివర్తి శ్రీనివాసరావు, బీచ్‌ రోడ్‌లోని బాలవికాస ఫౌండేషన్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్‌ గోడి విజయలక్ష్మి పాల్గొన్నారు. వడ్డాది : రెల్లి వీధిలో జగజ్జీవన్‌రావు, అంబేద్కర్‌ విగ్రహాలను తహశీల్దార్‌ మహేశ్వరరావు ఆవిష్కరించారు. అరుంధతి కాలనీలో, ఎల్‌బిపి అగ్రహారం, బంగారు మెట్ట గ్రామంలో విగ్రహాలను సర్పంచ్‌ కోరుకొండ కామాక్షి ఆవిష్కరించారు. కొత్తకోట :. కొత్తకోట, దొండపూడి, రావికమతం తదితర గ్రామాల్లో వేడుకలు జరిగాయి. కొమిర గ్రామంలో కొత్తకోట సిఐ లక్ష్మణ మూర్తి, ఎంపిడిఒ రామ చంద్రమూర్తి గ్రామ సర్పంచ్‌ గొర్లె రవికుమార్‌ పాల్గొన్నారు. కోటవురట్ల : మండలంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యే అనిత, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి సీతారామరాజు పాల్గొన్నారు. దేవరాపల్లి : నాలుగు రోడ్ల కూడలిలో జరిగిన కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, ఎం.అలమండలో దళిత సంఘం నాయకులు తాడి చంటి పాల్గొన్నారు. దత్త సాయి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు పోతల నాయుడు చీరలు పంపిణీ చేశారు. ఉక్కునగరం : వైఎస్‌ఆర్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, ఐఎన్‌టియుసి, బిఎంఎస్‌, డిఐటియు, ఎఐటియుసి యూనియన్ల కార్యాలయాల్లో అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉక్కునగరం సిఐటియు కార్యాలయంలో స్టీల్‌ గుర్తింపు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వైటి.దాస్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కూర్మన్నపాలెం కూడలిలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు, యూనియన్ల ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ సిఎండి పికె.రత్‌ ఉక్కునగరంలో బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. పెందుర్తి: మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో జివిఎంసి టిడిపి ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, బిఎస్‌పి రాష్ట్ర కార్యదర్శి బోను కృష్ణ, సిపిఎం డివిజన్‌ కార్యదర్శి జి.అప్పలరాజు, తహశీల్దార్‌ పి.రామారావు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.అశోక్‌ కుమార్‌ నివాళ్లర్పించారు. శ్రామిక నగర్‌లో సిపిఎం డివిజన్‌ కమిటీ నాయకులు బి.అనంతలక్ష్మి ఆధ్వర్యాన కార్యక్రమం జరిగింది. గొలుగొండ : ఎఎల్‌.పురం గ్రామంలో సర్పంచ్‌ లోచన సుజాత, వైసిపి నాయకులు చిటికెల భాస్కర్‌ నాయుడు, మాజీ ఎంపీపీ బొడ్డు వెంకట రమణ, అమ్మపేట గ్రామంలో సర్పంచ్‌ నిద్ర దేవుడు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. నాతవరం : వైబి.పట్నం గ్రామంలో అంబేద్కర్‌ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అచ్యుతాపురం రూరల్‌ : మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎపి కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు కె.సోమినాయుడు, సిఐటియు నాయకులు ఆర్‌.రాము, మహిళా సంఘం నాయకురాలు రాములమ్మ, అచ్యుతాపురం సర్పంచ్‌ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. సింహాచలం: 98వ వార్డు పరిధిలోగల విజనిగిరిపాలెంలో జరిగిన కార్యక్రమంలో వైసిపి నాయకులు కొలుసు ఈశ్వరరావు, ఎర్రవరం బాబు పాల్గొన్నారు. ఆరిలోవ : ఆరిలోవ అంబేద్కర్‌నగర్‌లో అంబేద్కర్‌ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 13వ వార్డులో కార్పొరేటర్‌ కెల్ల సునీత ఆధ్వర్యాన కార్యక్రమాలు జరిగాయి. 12వ వార్డు టిడిపి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ ఒమ్మి సన్యాసిరావు పాల్గొన్నారు. విమ్స్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ కడలి సత్యవర ప్రసాద్‌ ఆధ్వర్యంలోనూ వేడుకలు జరిగాయి.
అంబేద్కర్‌ స్ఫూర్తితో ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు
కలెక్టరేట్‌ : డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ స్పూర్తితో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా బుధవారం ఎల్‌ఐసి దరి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలే జీవనాడి అన్నారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణకై ఉద్యమించాలని, దేశ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, వై.రాజు, ఎం.సుబ్బారావు, వి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.