Sep 15,2021 19:30

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో 'గాడ్‌ ఫాదర్‌' ఒకటి. మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం మలయాళ పొలిటికల్‌ మూవీ 'లూసిఫర్‌'కు రీమేక్‌. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో పూర్తయింది. ఇప్పుడు రెండవ షెడ్యూల్‌ ఈ నెల 21 నుండి ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను కోసం చిత్ర యూనిట్‌ ఊటీకి వెళ్తుంది. చిత్రంలో కీలక పాత్రలు పోషించే పలువురు ప్రముఖ నటులపై ఈ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్లపై నిర్మాతలు ఎన్‌వి ప్రసాద్‌, ఆర్‌బి చౌదరి సంయుక్తంగా రామ్‌ చరణ్‌తో కలిసి నిర్మిస్తున్నారు.