Nov 30,2020 19:48

గణపవరం:వచ్చే ఏడాదికి నిడమర్రు మండలంలో మూడు కోట్ల రూపాయల ఉపాధి హామీ పని దినాలను లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు డ్వామా పీడీ పి.రాంబాబు తెలిపారు. సోమవారం నిడమర్రు ఎంపిడిఒ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. ఈ సమావేశానికి ఎంపిడిఒ టిఎస్‌.మహాలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ రాంబాబు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు సంబంధించిన రికార్డులు, ఎం బుక్‌ లు, రిజిస్టర్‌ సక్రమంగా నిర్వహిస్తే ఆడిట్‌లో సమస్యలు రావన్నారు. గ్రామాల వారీగా జరిగిన పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఎం.సతీష్‌, సిబ్బంది పాల్గొన్నారు.