Oct 28,2021 19:08

students to r.venkatarao

ఉపాధి అవకాశాల కల్పనలో జిల్లాలోనే ముందంజ
ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాల చైర్మన్‌ రావి వెంకట్రావు
ప్రజాశక్తి-ఆగిరిపల్లి
విద్యార్థినీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించటంలో ఎన్‌ఆర్‌ఐ కళాశాల కృష్ణాజిల్లాలోనే ముందంజంలో ఉందని కళాశాల చైర్మన్‌ రావి వెంకట్రావు అన్నారు. ఆగిరిపల్లి మండల పరిధిలోని పోతవరప్పాడు గ్రామంలోని ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో నాల్గో సంవత్సరం చదువుతున్న 120 మంది విద్యార్థులు బహుళజాతి సంస్థ విప్రోలో క్యాంపస్‌ సెలక్షన్‌కు ఎంపికయ్యారని తెలిపారు. ఇప్పటికే నాల్గో సంవత్సరం చదువుతున్న 300 మంది విద్యార్థులకు వివిధ కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పించామని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సి.నాగభాస్కర్‌ వివరించారు. నిర్ధిష్టమైన ప్రణాళికలతో మొదటి సంవత్సరం నుంచే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ అద్భుత అవకాశాలు సాధిస్తున్నట్లుగా కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ కె.శ్రీధర్‌ తెలిపారు. పరిశ్రమలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకొని వారి అవసరాలకు అనుగుణంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ మోడల్‌ భవిష్యత్త్‌ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చి దిద్దటంలో ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థ సఫలీకృతమైందని కళాశాల ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.వి.సురేంద్రబాబు తెలిపారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధించిన విద్యార్థులను డైరెక్టర్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ఆర్‌ అండ్‌ డి డాక్టర్‌ జి.రేషయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాధిపతులు, అధ్యాపకులు, ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్ధ్థులు పాల్గొన్నారు.