Nov 30,2020 23:05

ధర్నా చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-కాకినాడ : ఉపా చట్టాన్ని రద్దు చేయాలని చట్టం కింద అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపా రద్దు పోరాట కమిటీ నాయకులు జిల్లెళ్ల మనోహర్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, ముత్యాల శ్రీనివాసరావు, మచ్చా నాగయ్య, కొండా దుర్గారావు మాట్లాడారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదను కాపాడుతున్న ఆదివాసీలను దేశద్రోహులుగా, అభివద్ధి నిరోధకులుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామిక హక్కుల కోసం పని చేస్తున్న హక్కుల సంఘాల నాయకులను, ప్రజా సంఘాల నాయకులను, మేధావులను, రచయితలను అరెస్టు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వద్ధులను, పలు రకాల వ్యాధులతో బాధ పడే వారికి బెయిల్‌ కూడా ఇవ్వకుండా అక్రమంగా నిర్బంధస్తున్నారన్నారు.