
ప్రజాశక్తి - గన్నవరం
వరదల కారణంగా ఉల్లిపాయల ధర తీవ్ర స్థాయికి పెరిగింది. రోజురోజుకూ పెరుగుతూ రూ.80కి చేరింది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న జనాలకు ఉల్లి ధరలు మరింత పరేషాన్‌కు గురి చేస్తున్నాయి. గన్నవరం మార్కెట్లో 50 చిల్లర దుకాణాలు, 10 హోల్‌సెల్ దుకాణాలున్నాయి. ఉల్లి హోల్‌సేల్ దుకాణాలు రెండున్నాయి. ధరలు పెరగడంతో నాశిరకం ఉల్లి తీసు కొచ్చి విక్రయిస్తున్నారని చెబుతున్నారు. ఉల్లి లేని వంట రుచి ఉండదని అంటారు. ఉల్లి చేసిన మేలు ఎంతో ఉంటుందని వైద్యులు చెబుతారు. అలాంటి ఉల్లికి ధరల తాకిడి తగిలింది. వరదల కారణంగా ఉల్లి తోటలు దెబ్బతినడంతో వాటి ధరలు పెంచేశారు వ్యాపారులు. రైతు బజార్లో కూడా ఉల్లి అందుబాటులో లేదు. ప్రభుత్వం రంగంలోకి దిగి ధరలు అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.