Apr 06,2021 07:20

రండి.. రండి.. రండి
రెండో దండియాత్ర కు కదలి రండి
పదండి. .పదండి
పిడికెడు ఉక్కు కై పిడికిలి బిగించండి
ఇది మన విశాఖ ఉక్కురా
జాతిజనుల సొత్తురా
ఇది తెలుగు తల్లి ముక్కెర
అఖిలాంధ్రుల హక్కురా
మిక్కిలి త్యాగంతో దక్కెరా
పెక్కురి స్వేదంతో అగ్రస్థానమెక్కెరా
ఇది అభివృద్ధి కి దిక్కురా,
మన ఆత్మ గౌరవం లెక్కరా
రండి.. రండి.. సోదరా
దండులా కదలిరా !
పిడికెడు హక్కు కు
గండి పడనీయకురా !

- డా|| డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం.