Feb 28,2021 11:49

ప్రతిన బూనారు
పిడికిలి ఎత్తారు
విశాఖ ఉక్కు
ఆంధ్రుల హక్కు
అని రుజువు చేస్తారు
ఎందరో త్యాగమూర్తుల ప్రతిఫలం
నవరత్నం సాధించిన
ఉక్కు కర్మాగారం
ఆంధ్రులు ఆరంభశూరులు
కానే కారని నిరూపించారు
ఉక్కు నగరంలో ఉక్కు కర్మాగారం
సాధించారు
లాభాలు వచ్చే దానిని
వదిలించుకోవాలని
చూస్తున్నారు
నష్టాలు అన్వేషించటం లేదు
ప్రయివేటుపరం చేసుకుంటూపోతే
చూస్తూ ఊరుకునేది లేనేలేదు
తెలుగువారంటే కడుపుమంటా
రాష్ట్రాన్ని విడదీసేశారు
ఉన్న ఒక్కదానినీ అమ్మేస్తే
ఆంధ్రులు పౌర్షాగ్నిలో
భస్మం అయిపోతారు
ఆంధ్రుల ఉక్కు సంకల్పం ముందు
అన్నీ బలాదూరే
                    * గాదిరాజు రంగరాజు, 8790122275