Nov 26,2020 16:31

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌ శివార్లలోని హెచ్‌ఎంటి ప్రాంతానికి సమీపంలో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు సైనికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఇద్దరు సైనికులు పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇటీవల నాగ్రోటా సమీపంలోని జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై భద్రతాదళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జైషే మొహ్మద్‌ ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే పోలీసులపై దాడి జరగడం గమనార్హం. నాగ్రోటా కాల్పుల్లో ఇద్దరు అధికారులు గాయపడ్డారని, ఉగ్రవాదులు మరో దాడి చేసేందుకు ప్రణాళిక రచించారని, వారు కాశ్మీర్‌ లోయవైపు వెళ్లే అవకాశం ఉందని ఆ సమయంలో పోలీసులు హెచ్చరించారు.