Nov 26,2020 20:56

పూణె : ప్రీమియం స్కూటర్ల తయారీదారు పియాజ్జియో ఇండియా త్వరలోనే తమ ''ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 '' ఉత్పత్తిని ప్రారంభించినున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ మోడల్‌ను గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2020లో ఆవిష్కరించింది. దీని ఉత్పత్తిని బారామతి ప్లాంట్‌లో ప్రారంభించనున్నట్లు తాజాగా ప్రకటించింది. ''అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న, వినూత్నమైన ప్రీమియం స్కూటర్‌ను వినియోగదారులకు అందించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఆటో ఎక్స్‌పో 2020 వద్ద వాగ్ధానం చేసినట్లుగా, ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 ని భారతదేశంలో చేయబోతున్నాం'' అని పియాజ్జియో ఇండియా ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, డియాగో గ్రాఫీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా 250 డీలర్‌షిప్‌లు ఉన్నాయి.. ఈ నెట్‌వర్క్‌ను 400కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవలే ప్రకటించింది.