Jan 20,2021 00:51

గృహాలను ప్రారంభిస్తున్న నీలా పాథానియా

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ (ఐసిజి)లో పనిచేస్తున్న సైలర్లు, అధికారులకు సంబంధించి 93 ఇళ్లను నగరంలోని తూర్పునౌకాదళం పరిసరాల్లోగల మల్కాపురం ఏరియాలో ఏర్పాటు చేశారు. కోసగార్డులోగల సబార్డినేట్‌ అధికారులకు ఈ అకామడేషన్‌ అందుబాటులో ఉంటుంది. ఈమేరకు మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ ప్రాజెక్టును కోస్ట్‌ గార్డ్‌ కమాండర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ విఎస్‌ పాథానియా సతీమణి నీలా పాథానియా (అధ్యక్షురాలు తత్రక్షిక, ఈస్ట్రన్‌ సీ బోర్డు) ప్రారంభించారు. 93 క్వార్టర్లు సకాలంలో పూర్తి చేసినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో ఇలాంటి నిర్మాణం జరగడం ఇదే ప్రథమం అని కొనియాడుతూ అన్ని వసతులూ ఇక్కడ అందుబాటులో ఉంటాయని తెలిపారు. సైలర్లకు ఇదే ఓట 168 ఇల్లు నిర్మించి త్వరలోనే ఇవ్వనున్నట్లు ప్రకటించారు.