Nov 29,2021 13:09

ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : కర్నూలు తూర్పు (నంద్యాల) జిల్లా సిపిఎం ప్రథమ మహాసభ నంద్యాలలోని టి.షడ్రక్‌ ప్రాంగణంలో సోమవారం ప్రారంభమయ్యింది. సిపిఎం సీనియర్‌ నాయకులు తోట మద్దులు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.నాగరాజు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పలువురికి మహాసభ సంతాపం తెలిపింది. ఈ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌ రెడ్డి, రాష్ట్ర నాయకులు కె.ధనలక్ష్మి, వి.వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.