Nov 30,2020 19:39

ఫొటో : మాట్లాడుతున్న తహశీల్దారు బాలమురళీకృష్ణ

ఫొటో : మాట్లాడుతున్న తహశీల్దారు బాలమురళీకృష్ణ
తుపాను నష్టంపై అధికారులతో సమావేశం
ప్రజాశక్తి-బిట్రగుంట : బోగోలు మండలంలో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను నష్టాలను అంచనా వేసేందుకుమండల తహశీల్దార్‌ బాలమురళీకష్ణ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎంపిడిఒ నాసరరెడ్డి, ఇఒపిఆర్‌డి, ఆర్‌ డబ్ల్యూ ఎఇ, పంచాయతీ వ్యవసాయ అధికారులు కార్యదర్శులు, విఆర్‌ఒ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ మండలంలో దెబ్బతిన్న పంటలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ మద్దెబోయిన వీరరఘు, మాజీ ఎంపిటిసి మేకల శ్రీను, తదితరులున్నారు.