
చెన్నై : నివర్ దెబ్బకు సముద్ర తీర ప్రాంతంలో అలజడి నెలకొంది. తమిళనాడులో భారీ వర్షాలు మొదలయ్యాయి. దీంతో చెన్నైలోని ప్రజలు బెంబేతెత్తుతున్నారు. 2015 నాటి సంఘటనలు పునరావృతమౌతాయోమనన్న ఆందోళనలో పడ్డారు. ఆ ఏడాది కురిసిన భారీ వర్షాలకు చెన్నై నగరమంతా వరదల్లో చిక్కుకున్న సంగతి విదితమే. చెన్నై రహదారులన్నీ జలమయమయ్యాయి. కార్లనీ నీటమునిగిపోయాయి. కాగా, ఇప్పుడు కూడా ఇదే పునరావృతమౌతుందన్న భయాందోళనల్లో నగర ప్రజలు ఉన్నారు. దీంతో దక్షిణ చెన్నైలోని మడిపక్కంలో నివాసితులు తమ కార్లను తీసుకెళ్లి...సమీపంలోని రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉన్న వంతెన చివర్లలో పార్క్ చేస్తున్నారు.. వంతెనకు ఇరు వైపులా నిలిపి వుంచడంతో కార్లతో భారీ క్యూ కనిపిస్తోంది. గతంలో మడిపక్కంలో కురిసిన భారీ వర్షాలకు పలు కార్లు వరద నీటిలో వుండిపోయి...పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఇలా కార్ల క్యూ కడుతున్నారు.