
నక్కపల్లి : నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం మండల కన్వీనర్ ఎం.రాజేష్ డిమాండ్ చేశారు. మండలంలోని కాగిత గ్రామంలో తుపాను వల్ల నేలమట్టమైన పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో బాలయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి : సిపిఐ, ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు తుపానుతో దెబ్బతిన్న తుమ్మపాల వరి పొలాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు వైఎన్.భద్రం, కె.శంకరరావు, కోన లక్ష్మణ, ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు కొణతాల హరినాధ్ బాబు మాట్లాడుతూ వరుస తుపాన్లతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. నష్ట పరిహారం అందజేసి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు రవి, నాయుడు, మల్లి కార్జునరావు పాల్గొన్నారు.