Sep 15,2021 19:32

'జాతిరత్నాలు'తో హిట్‌ను సొంతం చేసుకున్న నవీన్‌ పోలిశెట్టి తన తర్వాత ప్రాజెక్ట్‌ గురించి అభిమానులకు తెలిపారు. 'జాతి రత్నాలు' దర్శకత్వ బృందంలో పని చేసిన కళ్యాణ్‌ శంకర్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ సినిమాని ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య, నాగవంశీ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. త్రివిక్రమ్‌ నిర్మాత మాత్రమే. త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుందని చిత్రబృందం తెలిపింది.