Apr 15,2021 00:14

మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-పర్చూరు : కూలీలతో వెళ్తున్న ఆటో ముందువెళ్తున్న ట్రాక్టర్‌ను ఢకొీన్న ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందాడు. ఈ ఘటన ఓడరేవు పిడుగురాళ్ల రోడ్డులో బుధవారం తెల్లవారు జామున చోటు చేసకుంది. వ్యవసాయ పనుల కోసం కూలీలు చిలకలూరిపేట నుంచి పర్చూరుకు ఆటోలో వస్తున్నారు. ఆటో అన్నంబొట్లవారి పాలెం వద్దకు వచ్చే సరికి ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢకొీట్టింది. దీంతో బొప్పూడి గ్రామానికి చెందిన షేక్‌ పరిదాబి(50) అక్కడికక్కడే మృతిచెందింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిలక లూరిపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ చిలకలూరిపేటకు చెందిన శేషారత్నం(45) మృతి చెందింది. ఎస్‌ఐ రమణయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.