Nov 28,2020 01:11

ఆందోళన చేస్తున్న తొలగించబడిన కార్మికులు

గాజువాక : ఆటోనగర్‌ డి బ్లాక్‌లోని సెయిల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యాజమాన్యం సుమారు 80 మంది కార్మికులను కరోనాను అడ్డంపెట్టుకుని తొలగించిందని, వెంటనే వారి విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు నాయకులు ఎం.రాంబాబు డిమాండ్‌ చేశారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం లేబర్‌ కమిషనర్‌ కార్యలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ... ఓల్డ్‌ కాంట్రాక్టర్‌ దగ్గర 15 సంవత్సరాలుగా పనిచేసిన 80 మంది కార్మికులను తొలగించి, కొత్త కాంట్రాక్టర్‌కు టెండర్‌ ఇచ్చిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చట్ట ప్రకారం కాంట్రాక్ట్‌ మారినా కార్మికుని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.రమణ, వాసు రాజు, నానాజీ, అబద్ధం, కార్మికులు పాల్గొన్నారు.