Apr 11,2021 15:21

చెన్నై : కరోనాతో ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి పిఎస్‌డబ్ల్యు మాధవరావు మృతి చెందారు. మాధవరావు శ్రీవిల్లిపుత్తూర్‌ నియోజక వర్గం నుండి పోటీ చేశారు. గత నెలలో కరోనా బారిన పడిన ఆయన..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఈ నెల 6న అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి విదితమే. ఎన్నికల తర్వాత మరణించినందున రీ పోలింగ్‌ ఉండదు. ఒక వేళ ఆయన గెలిస్తే...అప్పుడు రీ పోలింగ్‌కు అవకాశం ఉంది. ఆయన మృతిపై తమిళనాడు, పుదుచ్చేరి ఎఐసిసి కార్యదర్శి, ఇన్‌చార్జ్‌ సంజరు దత్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.