Apr 11,2021 15:47

ప్రజాశక్తి- తిరుమల : భారత అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన తన భార్య శివమాల, కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు టిటిడి చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఇఒ జవహర్‌రెడ్డి, అదనపు ఇఒ ధర్మారెడ్డి, అర్చకులు స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేయించారు. సిజెఐగా నియమితులైన తర్వాత తొలిసారి తిరుమల ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ అధికారులు సత్కరించారు. శ్రీవారి దర్శనంగా అనంతరం తిరుమల నుంచి ఢిల్లీకి జిస్టిస్‌ ఎన్‌.వి.రమణ తిరుగు ప్రయాణమయ్యారు. కాగా, ఈ నెల 24న సుప్రీంకోర్టు సిజె హోదాలో జస్టిస్‌ వెంకట రమణ మరోసారి శ్రీవారిని దర్శించుకోనున్నట్లు సమాచారం.