
టీ షర్ట్లు ఆవిష్కరిస్తున్న దృశ్యం
టీషర్ట్లు ఆవిష్కరణ
ప్రజాశక్తి - గూడూరు :ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా క్రికెట్ టోర్నమెంటణు ఈనెల 23,24 తేదీలలో అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ పోటీలలో పాల్గొనే జట్లకు సంబంధించిన టీషర్ట్లను దాత డాక్టర్ కోట సునీల్ కుమార్ సహకారంతో గురువారం చేవూరు విజయ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి,కార్య వర్గ సభ్యులు రామ్మోహన్ రావు, పీడీ కరిముల్లా, టీముల కెప్టెన్లు పాల్గొన్నారు.