
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు. ఐపీఎల్లో సత్తాచాటిన సిరాజ్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. దీంతో ప్రస్తుతం అతను అక్కడే ఉన్నాడు. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన అనంతరం ఈ విషయాన్ని తెలుసుకున్న సిరాజ్ శోకసంద్రంలో మునిగిపోయాడు. తండ్రి అంత్యక్రియలకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. క్రికెటర్‌గా సిరాజ్ ఇంత గొప్పస్థాయికి రావడంలో అతని తండ్రి గౌస్ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తూ సిరాజ్ కలను అతని తండ్రి నిజం చేశారు. ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు రూ.2.6కోట్లు ధర పలికాకే సిరాజ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత భారత్ -ఎ జట్టులో చోటు దక్కించుకున్న అతను నిలకడైన ప్రతిభను కనబర్చడంతో టీమిండియాకు ఎంపికయ్యాడు. ఇటీవల కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు తరపున సిరాజ్ సంచలన ప్రదర్శన ఇచ్చాడు. లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గానూ, ఒక్క పరుగు ఇవ్వకుండా మూడు వికెట్లు తీసిన బౌలర్‌గానూ రికార్డు సృష్టించాడు.