Feb 23,2021 18:01

బుర్ద్వాన్‌ : పశ్చిమబెంగాల్‌లో సిఎం మమత నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండా రాజ్యానికి ముగింపు పలికేది వామపక్షాలే అని సిపిఎం నేత సూర్యకాంత మిశ్రా అన్నారు. 2012లో టిఎంసి గుండాల చేతిలో దారుణ దాడి గురై మరణించిన ప్రదీప్‌థా, కమల్‌గయేన్‌ల స్మారక సభ మంగళవారం బుర్ద్వాన్‌లో జరిగింది. ఈ సభకు హాజరైన సూర్యకాంత మిశ్రా ముందుగా స్మాకర స్థూపాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ... ఆ భయంకరమైన ఘటన జరిగి నేటికి 10 ఏళ్లు గడిచిందన్నారు. రాష్ట్రంలో టిఎంసి గుండాయిజానికి ముగింపు పలకాలన్నా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నా.. అది వామపక్షాలతోనే సాధ్యమని అన్నారు. ఈ సభకు స్థానిక వామపక్ష నేతలతో పాటు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.

టిఎంసి గూండాయిజానికి ముగింపు పలికేది వామపక్షాలే! : సూర్యకాంత మిశ్రా