Mar 02,2021 21:51

నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు

        అనంతపురం రూరల్‌ : రాష్ట్రంలో అధికార వైసిపి ప్రభుత్వం టిడిపి నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేశారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుగ్గయ్య చౌదరి, సీనియర్‌ నాయకులు బొమ్మగౌని కిరణ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్లమెంటరీ కార్యాలయం వద్ద కళ్లకు రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు శాంతియుతంగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీని కలిసి అక్కడ జరుగుతున్న అన్యాయలను వివరిస్తాను అని చెప్పినా పోలీసులు వినకుండా ఆయన్ను అరెస్టు చేయడం దారుణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలతో పాలన సాగిస్తోంది తప్పా, ప్రజలకు చేస్తున్న మేలు ఏమీ లేదన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ నగర అధ్యక్షులు కష్ణకుమార్‌, మాజీ కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రాయల్‌ మురళి, రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీనరసింహ, పార్లమెంట్‌ అధ్యక్షుడు గుత్తా ధనుంజయ, మాజీ కార్పొరేటర్‌ డిష్‌ ప్రకాశ్‌, శ్రీరాములు, సీనియర్‌ నాయకులు చెక్కా నాగేంద్ర పాల్గొన్నారు.