Nov 30,2020 21:25

పార్టీ కండూవా కప్పుతున్న మాజీ ఎమ్మెల్యే

ప్రజాశక్తి - మడకశిర రూరల్‌ : తాము టిడిపిని వీడే ప్రసక్తే లేదని మండలంలోని వైబి హళ్లి పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులుఅన్నారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన రామంజప్ప, నారాయనప్ప, , రామలక్ష్మమ్మ తిప్పమ్మ తదితరులు తాము 1983 నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని తమ ప్రాణం ఉన్నంతవరకు పార్టీని వీడేది లేదని చెప్పారు. స్వచ్ఛభారత్‌ బిల్లులు మంజూరు చేయాలని ఆదివారం స్థానిక ఎమ్మెల్యేను అడగడానికి వెళితే వైసిపి నాయకులు పార్టీలోకి చేరాలని బలవంతంగా కండూవాలు వేశారని ఆరోపించారు. తాము టిడిపిని వీడే ప్రసక్తే లేదని చెప్పారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న సమక్షంలో వారు టిడిపి కండూవాలు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, వైబి.హళ్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎంపిపిలు బొజ్జప్ప, ఆదినారాయణ జిల్లేడుగుంట రామచంద్ర గౌడ తదితరులు పాల్గొన్నారు.