Nov 29,2021 13:32

అనంతపురం : టిడిపి హయాంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన సీసీ రోడ్లు, తదితర వాటికి సంబంధించిన రూ.54 లక్షల చెక్కును 10 మంది టిడిపి కాంట్రాక్టర్లకు సోమవారం అందజేశారు. తోపుదుర్తి రాజశేఖర్‌ రెడ్డి సహకారంతో చెన్నేకొత్తపల్లి మండలం పులేటిపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్‌ బచ్చలరెడ్డి ప్రియభాస్కర్‌ రెడ్డి, బచ్చల భాస్కర్‌ రెడ్డి లు ఈ చెక్కును అందించారు. ఈ సందర్భంగా టిడిపి కాంట్రాక్టర్లు బచ్చల భాస్కర్‌ రెడ్డి కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపి సంతోషాన్ని వ్యక్తపరిచారు.