Feb 11,2021 16:01

మడకశిర రూరల్‌ (అనంతపురం): మడకశిర మండలం మెళవాయి పంచాయతీ టిడిపి అభ్యర్థిగా పోటీలో ఉన్న ముద్దరంగప్ప కుమారుడు ఉమేష్‌ రోడ్డు ప్రమాదంలో బుధవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఈరన్న మెళవాయి గ్రామానికి చేరుకుని ఉమేష్‌ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. టిడిపినాయకులు వెంకటసుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్‌ నారాయణ గౌడ్‌, మాజీ ఎంపిటిసి లక్ష్మీనారాయణ, మాజీ మున్సిప చైర్మన్‌ ప్రకాష్‌, కిష్టప్ప, తదితరులున్నారు.