Nov 22,2020 15:49

మల్కాజ్‌గిరి: నోరోడ్స్‌ .. నో ఓట్స్‌ ప్లకార్డులను చూపుతూ యాప్రల్‌ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారానికి వచ్చిన టిఆర్‌ఎస్‌కు చెందిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే హనుమంతరావును యాప్రల్‌ ప్రజలు నిలదీశారు. అనంతరం 2కి.మీ వరకు స్థానికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. దీంతో కంగుతిన్న ఎమ్మెల్యే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు అయిపోగానే సొంత నిధులతో రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. లెటర్‌ ప్యాడ్‌పై కూడా సంతకం చేసి ప్రమాణం చేశారు. దీంతో స్థానికులు శాంతించారు. హామీని నెరవేర్చకపోతే మరోసారి తమ ప్రాంతానికి రానీయమని తెగేసి చెప్పారు.