
ఆరిలోవ : కరోనా నేపథ్యంలో ఎనిమిది నెలల విరామం అనంతరం ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాల, దాని ఎదురుగా ఉన్న కంబాల కొండ ఎకో టూరిజం పార్కు మంగళవారం తెరుచుకున్నాయి. ఉదయాన్నే సిఎఫ్ రామ్మోహన్రావు, డిఎఫ్ఒ అనంత శర్మ కంబాల కొండకు సందర్శకుల ప్రవేశాన్ని తిరిగి ప్రారంభించారు. కంబాల కొండను తొలి రోజు 40 మంది, జూ పార్కుకు 672 మంది తరలివచ్చారు. వారి నుంచి రూ.42264 ఆదాయం లభించింది. కంబాల కొండ, జూపార్కులోకి బయట ఆహారం తీసుకు రాకూడదని నిబంధనలు పెట్టడంతో సందర్శకులు నిరాశ చెందారు.