Nov 30,2020 22:55

ఆర్‌జెడికి ఫిర్యాదు చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : తెనాలి ఎంఇఒ అవినీతి కార్యకలాపాలపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్‌ నాయకులు పాఠశాల విద్య ఆర్జేడికి యుటిఎఫ్‌ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. 2008 డిఎస్సీకి చెందిన ఒక ఉపాధ్యాయుని ఎరియర్‌ బిల్లు వేయటానికి రూ.40వేలు ఇవ్వాలని ఎడివి ప్రసాద్‌ ద్వారా డిమాండ్‌ చేశారని, ఆదే డిఎస్సీకి చెందిన మిగిలిని ఉపాధ్యాయుల బిల్లులన్నీ చేసి, డబ్బులు ఇవ్వటానికి నిరాకరించిన ఉపాధ్యాయుని బిల్లు మాత్రం పక్కన పడేశారన్నారు. 2019 ఏప్రిల్‌ 13న సదరు ఉపాధ్యాయుడు అధికారికంగా సెలవు పెట్టారని, బయోమెట్రిక్‌ ప్రకారం డిఇఒ కార్యాలయ రిపోర్ట్‌ స్పష్టంగా సిఎల్‌ పెట్టినట్లుగా ఉందని కానీ సెలవు పెట్టలేదని వేతనం నిలుపుదల చేశారన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవటానికి, టీచర్లను భయపెట్టి తనకు అనుకూలంగా రాయించుకుంటున్నాడన్నారు. మహిళా టీచర్ల పట్ల ఎంఇఒ వైఖరి తీవ్ర గర్హనీయమని, ఎవరైనా బయటకు చెప్పినా, ఫిర్యాదుచేసినా వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సదరు ఎంఇఒపై చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్షంగా ఆందోళన చేస్తామన్నారు. ఆర్‌జెడి వెంటనే సదరు ఎంఇఒకు ఫోన్‌ చేసి, వెంటనే ఉపాధ్యాయుని బిల్లు హెచ్‌ఎం నుంచి తెప్పించుకొని క్లియర్‌ చేయాలని ఆదేశించారన్నారు. ఆర్‌జెడిని కలిసిన వారిలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, కె.నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర సహాధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు, జిల్లా సహాధ్యక్షులు బి.ఆదిలక్ష్మి, జిల్లా కోశాధికారి ఎం.కళాధర్‌ తదితరులున్నారు.