Jan 18,2021 18:41

ఎన్‌టిఆర్‌కు నివాళులర్పిస్తున్న మాథూర్‌, కిరణ్‌కుమార్‌ తదితరులు

ప్రజాశక్తి - పి.గన్నవరం
తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్‌టిఆర్‌ ప్రతీకగా నిలిచారని టిడిపి పి.గన్నవరం నియోజకవర్గ నాయకులు మందపాటి కిరణ్‌కుమార్‌ అన్నారు. ఎన్‌టిఆర్‌ 25వ వర్థంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమలాపురం పార్లమెంటు టిడిపి ఇన్‌ఛార్జి గంటి హరీష్‌మాథూర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోతవరంలో కిరణ్‌ కుమార్‌, అనిత దంపతులు సమకూర్చిన దుప్పట్లు, పండ్లను 60 మంది నిరుపేద కుటుంబాలకు హరీష్‌ మాథూర్‌ చేతుల మీదుగా అందించారు. అనంతరం హరీష్‌మాథూర్‌, కిరణ్‌కుమార్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పాలనలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న మహనీయుడు ఎన్‌టి.రామారావు అన్నారు. జన రంజక పాలన అందించిన వ్యక్తి ఎన్‌టిఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు టిడిపి మహిళా అధ్యక్షులు పెచ్చెట్టి విజయలక్ష్మి, మాజీ ఎంపిపి దాసరి వీరవెంకటసత్యనారాయణ(డివి), ఆత్మ కమిటీ చైర్మన్‌ పబ్బినీడి రాంబాబు, నాగమణి, టిడిపి మండల మాజీ అధ్యక్షులు ముత్యాల సాయిబాబు, గూటం శ్రీను, కుసుమ నాగేశ్వరరావు, అగ్గిరాముడు, కామాడి రాంబాబు, నక్కా సునీల్‌, లంకే చిరంజీవి, లంకే భీమరాజు, చీకట్ల రామకష్ణ, ముంగండ శ్రీరామ్మూర్తి, కొప్పిశెట్టి సతీష్‌, టిడిపి మైనారిటీ సెల్‌ నాయకులు బాషా, కాగిత సత్యనారాయణ, బూలా రమేష్‌, మట్టపర్తి భూలక్ష్మి, మట్టపర్తి కష్ణ, మట్టపర్తి వెంకటేశ్వర రావు, పంబల నాగేంద్ర, పెండ్ర రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.